రంగారెడ్డి, ఆగష్టు 2 : జిల్లాలోని శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్‌లో నకిలీ కరెన్సీ ముఠా సభ్యులు రెచ్చిపోయారు. నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులపై ముఠా సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐ వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్ ఈశ్వరయ్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ వెంకట్‌రెడ్డి దొంగలపై కాల్పులు జరపడంతో ఓ దొంగ మృతి చెందాడు. అతడు ముస్తాఫాగా పోలీసులు గుర్తించారు. దొంగల దాడిలో ఎస్ఐ, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ ఈశ్వరయ్య మృతి చెందగా, ఎస్ఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.




