ఎస్‌ఐకి తీవ్రగాయాలు
పోలీసు కాల్పుల్లో నిందితుడి మృతి
హైదరాబాద్: రంగారెడ్డిజిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ ారస్తాలోని బావార్చీ ¬టల్ వద్ద శుక్రవారం అర్థరాత్రి పోలీసులు, నకిలీ నోట్ల చలామణి ముఠా మధ్య జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా చోటు చేసుకున్న ఘర్షణలో నిందితుడితో పాటు కానిస్టేబుల్ ఈశ్వర్ మృతిచెందగా, ఎస్.ఐ వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… నకిలీనోట్లు చలామణి చేస్తున్న కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు సమావేశమైనట్లు తెలుసుకున్న బాలానగర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు 8మంది బృందంతో మజీద్‌పుర్ ారస్తాకు చేరుకున్నారు. దేవాలయం సమీపంలో ఓ వాహనంలో మాటు వేసిన ఆగంతకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి, కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణకోసం కాల్పులు జరపగా… నకిలీనోట్ల ముఠాలోని సయ్యద్‌ముస్తాఫా ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు నకిలీనోట్ల ముఠా సభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఈశ్వర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈశ్వర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. ఎస్.ఐ వెంకటరెడ్డి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. నిందితులు మొత్తం నలుగురు ఉన్నారని, వారిలో ఒకరు మృతిచెందగా… మిగిలిన ముగ్గురు బొలెరో వాహనంలో పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన ముస్తాఫా మెదక్‌జిల్లా సిద్దిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన ఎల్ల్ణొండ్ నకిలీనోట్ల చలామణిముఠాను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని రఘు, నంద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు.
నకిలీనోట్ల చలామణి ముఠా దాడిలో కానిస్టేబుల్ మృతి





