Tuesday, 3 November 2026

శంషాబాద్‌ వద్ద గజదొంగ ఎన్‌కౌంటర్‌

శంషాబాద్‌ ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుపై అర్ధరాత్రి ఘటన

తొలుత పోలీసులపై కత్తితో దాడి.. ఆపై కాల్పుల్లో హతం

250కి పైగా గొలుసు చోరీల్లో నిందితుడు: పోలీసులు

శంషాబాద్‌: శంషాబాద్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలోని హుడా కాలనీ సర్వీసు రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌లో నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం అర్మూరుపాడుకు చెందిన కడవలూరి శివ(28) అనే గజదొంగ మృతి చెందాడు. అతను రెండు నెలలుగా సైబరాబాద్‌ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడిపై నిఘా వేసిన పోలీసులకు శుక్రవారం రాత్రి ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద తిరుగుతున్నట్లు తెలిసింది. అతడు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంగా అతనున్న ప్రాంతాన్ని పసిగట్టిన పోలీసులు అన్ని సర్వీసు రోడ్లపై తనిఖీలు ప్రారంభించారు. విమానాశ్రయం ఠాణా నుంచి హుడా కాలనీకి వెళ్లే రోడ్డులో రాజేంద్రనగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.నర్సింహారెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా… శివ ఏపీ 29 బీటీ 0120 నంబరు ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి సమయంలో అటుగా వచ్చాడు. సీఐ అతడిని ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేశాడు. ఇన్‌స్పెక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఎస్సై అప్రమత్తమై దొంగను నిలువరించేందుకు యత్నించాడు. ఈక్రమంలో ఎస్సై చేతికి, పొట్టకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో మూడు /ొండ్లు కాల్చగా శివ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఎస్సైని తొలుత శంషాబాద్‌ ట్రెఱడెంట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మాదాపూర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనాస్థలిని శంషాబాద్‌, బాలనగర్‌ డీసీపీలు రమేశ్‌నాయుడు, ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ సందర్శించారు. శివపై 250కి పైగా గొలుసు దొంగతనాల కేసులున్నట్లు అదనపు డీసీపీ(క్రైమ్స్‌) జానకి షర్మిల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *