Tuesday, 3 November 2026

సింగపూర్ పర్యటనలో కేసీఆర్‌కు అరుదైన కానుక

సింగపూర్, ఆగష్టు 21 : సింగపూర్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన బహుమతి లభించింది. కొందరు ఔత్సాహికులు కేసీఆర్ బొమ్మతో ఉన్న హాలోగ్రాఫిక్స్ ఫ్రేంను ఆయనకు బహూకరించారు. ఎటువైపు నుంచి చూసినా కేసీఆర్ కనిపించడం ఈ ఫ్రేం ప్రత్యేకత. బ్రాండ్ తెలంగాణ పేరుతో సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటైన బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం, సింగపూర్ హైకమిషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సమ్మిట్‌లో కేసీఆర్ బొమ్మతో ఉన్న హాలో గ్రాఫిక్స్ ఫ్రేం ఆకర్షణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *