Tuesday, 3 November 2026

జడ్జిల నియామక విధానం మార్పుపై సుప్రీంలో దాఖలైన పిటీషన్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 21 : జడ్జీల నియామక విధానాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో గురువారం పిటిషన్లు దాఖలయ్యాయి. కొలీజియం విధానం రద్దుకు వ్యతిరేంకగా దాఖలైన మూడు పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

కొలీజియం విధానం రద్దును భారత ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా బహిరంగంగానే వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వ్యవస్థల మధ్య పరస్పరం గౌరవం ఉండాలని, ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోరాదని ఆయన వ్యాఖ్యానించారు. జడ్జిల నియామక విధానాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఇటీవలే ఆమోదించిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *