చిత్తూరు, ఆగష్టు 21 : కెన్యాలో చిత్తూరు జిల్లా వాసి ఎబోలా వ్యాధితో చనిపోయినట్లు వార్తలు వినవస్తున్నాయి. జిల్లాలోని పూతలపట్టు మండలం చిదిపిరాళ్లకు చెందిన గజేంద్రరెడ్డి విష జ్వరంతో నాలుగురోజుల క్రితం కెన్యాలో మరణించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గజేంద్రరెడ్డికి విషజ్వరంతో పాటు ఒళ్లంతా బొబ్బలు రావడంతో చనిపోయాడని సమాచారం. ఎబోలా వ్యాధితో గజేంద్రరెడ్డి చనిపోయాడని పుకార్లు వస్తున్నాయి. ఆయనకు చికిత్స చేసిన డాక్టరు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. గజేంద్రరెడ్డి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం అతడి భార్య ఇండియాకు బయలుదేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.




