ఖమ్మం, పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్న పలువురు ఫైనాన్షియర్ల ఇళ్లల్లో గురువారం మూకుమ్మడి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వారి వద్ద నుంచి రూ.కోట్ల విలువగల తాకట్టు బంగారం, ప్రామిసరీ నోట్లు, చెక్కు పుస్తకాలు, ఖాళీ ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సుమారు 35మంది ఫైనాన్షియర్ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. శాస్ి రోడ్డులోని తల్లాడ శ్రీనివాసరావు ఇంట్లో పోలీసులు రూ.5కోట్ల విలువగల తాకట్టు బంగారం సీజ్ చేశారంటే పాల్వంచలో అక్రమ వడ్డీ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో తేటతెల్లమవుతోంది. వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




