హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి భూమిలో కబ్జా రాయుళ్లను ఖాళీ చేయించి ఆ భూమిని లబ్ధిదారులకిస్తామని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఇవాళ మానసిక వైద్యశాల ఆకస్మిక తనిఖీలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి భూమిలో 78 మంది అక్రమంగా నివాసముంటున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సర్వే ద్వారా ఆస్పత్రి భూమి ఆక్రమణ వెలుగులోకి వచ్చిందని అన్నారు.




