హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలు అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిశారు. తమకు అసెంబ్లీలో కార్యాలయం కేటాయించకపోవడంపై నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై తమకు స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని సదారామ్ స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన టీ టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాల్లోగా తమకు కార్యాలయం కేటాయించాలని లేకుంటు బాగుండదని హెచ్చరిస్తూ వెళ్లారు.




