నల్లగొండ: జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. భూగర్బ నీటిమట్టం పెరిగితే ఇది సాధ్యమన్నారు. ఈమేరకు జిల్లాలోని నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ, జూరాల, పాకాల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్మారని అందుకే టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని వెల్లడించారు. కేసీఆర్ చేసిన అలుపెరుగని పోరాటం వల్లే తెలంగాణ కళ సాకారమైందన్నారు. కోనపురి సాంబశివుడు, రాములు హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ప్రధాన నిందితుడు నయూమ్‌ను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. ఇందుకోసం ఇంటర్‌పోల్ సహాయంతో రెడ్‌కార్నర్ నోటీసులు ఇష్యూ చేపిస్తామన్నారు.




