Tuesday, 3 November 2026

‘రైతులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి’

హైదరాబాద్: ప్రభుత్వాధికారులు రైతులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. ఇవాళ ఆయన మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కెట్‌యార్డుల్లో నిర్వహణ పనులకు ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసిందని స్పష్టం చేశారు. తీవ్రమైన కరువు నేపథ్యంలో ఉపాధిహామీ పథకం పనిదినాలను 150 రోజులకు పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *