Tuesday, 3 November 2026

మెదక్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం : సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 27 : మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ఆ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు మేలు జరింగేమీ లేదని అన్నారు. రైతులు కరువు కాటకాలతో బాధపడుతున్న ప్రభుత్వం ఆదుకోవడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం స్పందించడంలేదని ఆమె విమర్శించారు. తెలంగాణ ప్రజలు విసిగిపోయిఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఇంత తొందరగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదీ లేదని.. తెలంగాణ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని ఆమె ఆశాభావం వ్కక్తం చేశారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తారని సునీతా లక్ష్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *