Monday, 2 November 2026

ఎంసెట్‌ కౌన్సిలింగ్‌పై తొలిగిన ప్రతిష్ఠంభన

సుప్రీం ఆదేవాలతో ఇక ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ రభసకు తెరపడినట్లే. ఆగస్టు 31లోగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించడంతో అందుకు ఇరు రాష్టాల్రు అంగీకరించాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది.  పునర్విభజన చట్టం ప్రకారం ప్రవేశాలు జరపాల్సిందిగా  సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో అడ్మిషన్ల వరకు ప్రక్రియ సాఫీగా సాగే అవకాశాలుఉన్నాయి. ఇరు రాష్టాల్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు దీనిపైనే దృష్టి పెట్టాలి. ఇంకా వివాదాల జోలికి వెళ్లకుండా ముందుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలి. ఉమ్మడి రాష్ట్రంగా పనిచేసిన ఉన్నత విద్యామండలి కూడా సమస్యను పరిష్కరించేదిగా పనిచేయాలి తప్ప తంపులు తెచ్చేది ఉండరాదు. లేదా ఎవరొ ఒకరికి కొమ్ముకాయరాదు. అలా చేయడం వల్లనే సమస్య ఇంతదాకా వచ్చింది. దీనిని సరిచేసుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత దానిపైనా ఉంది. అందుకు అది తెలంగాణ అధికారులను విశ్వాసం లోకి తీసుకోవాలి. అంతేగాని ఒంటె/-ంద్దు పోకడలతో పోతానంటే మళ్లీ వివాదాలు తప్పవని గుర్తుంచుకోవాలి. తెలంగాణ సర్కార్‌ కూడా అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి వివాదాలకు తావీయరాదు. ఎందుకంటే  ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అక్టోబరు 31వరకు గడువు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై  స్పందించిన సుప్రీం గడువు కుదరదని తేల్చి చెప్పింది. బోధన రుసుములు, స్థానికత అనేవి విచారణ పరిధిలోకి రావనీ, గడువు ఇవ్వాలన్న పిటిషన్‌ ఒక్కటే ప్రస్తుతం తమ ముందు ఉందని ధర్మాసనం తెలిపింది. దీంతో తెలంగాణ సర్కార్‌కు ఫాస్ట్‌ పథకం అమలుకు అడ్డంకులు లేనట్లే. నిజానికి అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడో మొదలు పెట్టి ఫీజుల విషయంలోనే చర్చ చేసి ఉంటే బాగుండేది. ఎవరికి ఫృజులు చెల్లించాలి.. చెల్లించకూడదన్న వివరాల ప్రకారం వెల్లి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదు. అయితే ఇప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ మొదలయినా సీట్ల కేటాయింపు తరవాత ఎవరికి ఫీజులు అన్న సందేహాలు, గందరగోళాలు తప్పేలా లేవు. కొన్ని కళాశాలల్లో జరిగిన అవకతవకలను కూడా సరిచేయాల్సి ఉన్నందును కౌన్సిలింగ్‌ గడువు పెంచాలన్న తెలంగాణ వాదనను సుప్రీం నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

చట్టం ప్రకారం ప్రవేశాలు ఈ సంవత్సరం వరకే అమలులో ఉంటాయా అని తెలంగాణ న్యాయవాదులు కోరగా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉంటుందని జ్టసిస్‌ ముఖోపాధ్యాయ తెలిపారు. ఇక స్థానికతపైనా ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ వాదించింది. తెలంగాణ ప్రభుత్వం ‘1956 సంవత్సరం’ స్థానికత అని అంటోందని దీనిపై స్పష్టత కావాలని సీనియర్‌ న్యాయవాది పీపీరావు ధర్మాసనాన్ని కోరారు. దీనిపై జ్టసిస్‌ ముఖోపాధ్యాయ స్పందిస్తూ.. చట్టం ప్రకారమే ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు.  కౌన్సెలింగ్‌కు తాము సిద్ధంగా ఉన్నామని మొదటి నుంచి చెబుతున్నామని, ఆగస్టు 31కల్లా కౌన్సెలింగ్‌ పూర్తిచేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. ప్రవేశాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు పక్క రాష్టాల్రకి తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ ఉన్నత విద్యామండలి రెండు రాష్టాల్ల్రోనూ ప్రవేశాలు నిర్వహించొచ్చని పునర్విభజన చట్టంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే వివాదం మరింతగా ముదరకుండా తెలంగాణ, ఆంధ్ర రాష్టాల్ర అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎంసెట్‌ ప్రవేశాల పక్రియ నిమిత్తం ఉమ్మడి ఆంధప్రదేశ్‌ను ఉస్మానియా, ఎస్‌వీ, ఆంధ్రా యూనివర్సిటీలుగా మూడు రీజియన్లుగా విభజించారు. దీంట్లో ఏ రీజియన్‌కు చెందిన వారు ఆ రీజియన్‌లో చేరితే స్థానికతగా పరిగణిస్తారు. దీనికి 85 శాతం సీట్లు కేటాయించారు. మిగతా 15 శాతం సీట్లు స్థానికేతరులుగా  పరిగణిస్తారు.

ఈ నాన్‌ లోకల్‌లో రాష్ట్ర పరిధిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అయితే ఇక్కడే ఫీజుల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి ఎలాంటి ముగింపు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. సుప్రీం కూడాఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వివాదంలో ఫీజులు, స్థానికత అంశాల జోలికి వెళ్లకుండానే సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువరించింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పక్రియను ఈ నెల 31వ తేదీకల్లా పూర్తిచేయాలని మాత్రమే ఆదేశాలు జారిచేసింది. ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే ఈ పక్రియను పూర్తిచేయాలని సూచించింది.మొత్తానికి వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిందనే చెప్పాలి. అధికారులు ఇప్పుడు అడ్మిషన్లపై దృష్టి పెట్టాలి. ఫీజులు ఎవరు ఇస్తారన్నది లేదా ఎవరు కడతారన్నది తదుపరి అంశంగా ఉండాలి. ఇది చట్టబద్దమైన అంశం కాదు. ఫీజులు చెల్లించడమనేది ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన అంశం మాత్రమే. విద్యార్థుల భవిష్యత్‌ దృష్టిలో పెట్టుకుని ఫీజులు చెల్లించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కాలేజీలు అరకొర వసతులతో ఉండి కేవలం ఫీజుల కోసమే నడిపతే అలాంటి వాటికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిబంధనల ప్రకారం నడవని కాలేజీలకు ఫీజులు తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఎలాగూ ఉంటుంది. దీనిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్లడమే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *