హైదరాబాద్: జంటనగరాల్లో ఇవాళ్టి నుంచి గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు ట్యాంక్‌బండ్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయకచవితి పూర్తయి మూడవ రోజు కావడంతో పలువురు విగ్రహాలను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో నిమజ్జనం చేసే అవకాశం ఉంది.




