Monday, 2 November 2026

ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత

10570479_823412534360194_896427727183108164_n
చంద్రబాబు, కేసీఆర్‌ సహా ప్రముఖుల సంతాపం

చెన్నై, ఆగష్టు 31 : ప్రముఖ సినీ దర్శకుడు బాపు (80) అనారోగ్యం బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఆయన అసలుపేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. బాపు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం. బాపు తొలి చిత్రం ‘సాక్షి’, చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’. కార్టూనిస్టుగా, చిత్రకారుడుగా బాపు సుప్రసిద్ధుడు. 1933 డిసెంబర్‌ 15న వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు బాపు జన్మించారు. 1955లో మద్రాస్‌ వర్శిటీ నుంచి బాపు లా పట్ట పుచ్చుకున్నారు.

మిస్టర్‌ పెళ్లాం, శ్రీరామరాజ్యం సినిమాలకు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. 2013లో బాపు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దర్శకుడుగా రెండు జాతీయ, రెండు నంది, రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను కూడా ఆయన్ని వరించాయి. తన వినూత్న రాకతో బాపు శైలి అనే పేరును సంపాదించిన గొప్ప వ్యక్తి. కంప్యూటర్లలో బాపు ప్యాన్‌ ఆయన పేరే వచ్చింది. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా బాపు అందుకున్నారు.
బాలరాజు కథ, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, మిస్టర్‌ పెళ్లాం, శ్రీరామరాజ్యానికి నంది అవార్డులు వచ్చాయి. ముళ్లపుడి వెంకట రమణతో బాపుకి సాన్నిహిత్యం అలవడింది. కార్టూనిస్టు, చిత్రకారుడిగా బాపు సుప్రసిద్ధులు, బాపు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
 

బాపు దర్శకత్వం వహించిన చిత్రాలు….

శ్రీరామరాజ్యం, పెళ్లిపుస్తకం, ముత్యాల ముగ్గు, సుందరకాండ, రాధాగోపాలం, మిస్టర్‌ పెళ్లాం, మంత్రిగారి వియ్యంకుడు, భక్తకన్నప్ప తదితర చిత్రాలు.

బాపు మృతికి ప్రముఖుల సంతాపం…
బాపు మృతి విషయం తెలిసుకున్న ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాపు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం జయలలిత, సినీ ప్రముఖులు దాసని నారాయణరావు, రామానాయుడు, కృష్ణ, మురళీమోహన్‌, బ్రహ్మానందం, కె. విశ్వనాథ్‌, చిరంజీవి తదితరులు సంతాపం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *