చంద్రబాబు కుట్రలకు కేంద్రం వంత పాడుతున్నదని, దీనిపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మెదక్ ఫలితాల దెబ్బతో తెలంగాణ రాష్ట్రంపై ఆంక్షలు తొలిగిపోవాలేనన్నారు. సీమాంధ్ర పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సిద్ధిపేటను అభివృద్ధి చేసుకున్నాం. సిద్ధిపేటను ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మన ప్రభుత్వానికి ఇంకా వంద రోజులు కూడా నిండలేదన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న ఆనాటి సీఎం కిరణ్‌తో కోట్లాడిన విషయం గుర్తు చేశారు. మన సీఎం కేసీఆర్ రైతుల కోసం రూ. 480 కోట్లు విడుదల చేశారని తెలిపారు. సునితా లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఉప ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని అడిగారు. జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఇవ్వొద్దని సోనియా వద్దకు వెళ్లి చెప్పిండు. సమైక్యవాది జగ్గారెడ్డికి ఓటేయడం అవసరామా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ విధానమేంటో కిషన్‌రెడ్డి చెప్పాలని అడిగారు. సమైక్యవాదం వినిపించిన జగ్గారెడ్డిని ఉప ఎన్నికల్లో ఎలా నిలబెట్టారన్నారు. హైదరాబాద్‌లో గవర్నర్ గిరి కోసం ప్రయత్నిస్తున్నవారికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తే వారు మనకు అవసరమా అని అడిగారు.




