ఆదిలాబాద్: టీచర్ కొట్టిందని ఏడవ తరగతి చదువుతున్న మనీషా అనే విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని జైనూరు మండలం పోచంలొద్ది కస్తూర్భా పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.




