Monday, 2 November 2026

మాజీ అటార్నీ జనరల్ వాహనవతి కన్నుమూత

ముంబయి: మాజీ అటార్నీ జనరల్ జీ. వాహనవతి గుండెపోటుతో కన్నుమూశారు. వాహనవతి భారత 13వ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 7 మే, 1949 న జన్మించిన ఆయన నేడు పరమపదించారు. జూన్ 2009 న భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2014 వరకు దాదాపు ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగారు. వాహనవతి సోలిసిటర్ జనరల్‌గా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ మహారాష్ట్రగా వంటి తదితర బాధ్యతలను నిర్వర్తించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *