హైదరాబాద్: స్నేక్‌గ్యాంగ్ ఘటనలో మరో ఐదుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పహాడీషరీఫ్‌లోని షాహిన్‌నగర్‌లో గడిచిన అర్థరాత్రి నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో స్వయంగా పాల్గొన్న సీవీ ఆనంద్ వివరాలను వెల్లడిస్తూ.. స్నేక్‌గ్యాంగ్ ఘటనలో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. నేరాల నియంత్రణ కోసం, నేరగాళ్ల అదుపునకు తనిఖీలను చేపట్టాం. తనిఖీల్లో భాగంగా ఎటువంటి ఆధారాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 కార్లను స్వాధీనం చేసుకున్నాం. మరో తొమ్మిది మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు.




