హైదరాబాద్: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రవీంద్రభారతిలో టీచర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర గో గ్రహణం పాఠం గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మృత్యుంజయ శర్మ గారి దగ్గర విద్య నేర్చుకున్నానన్నారు. ఫీజు లేకుండా శర్మగారు తనకు పాఠాలు చెప్పిండని.. తాను ఇలా మాట్లాడుతున్ననంటే మా గురు దేవులు పెట్టిన అక్షరభిక్షేనని ఉద్ఘాటించారు.




