(జనంసాక్షి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ విద్యార్థులతో ముఖా ముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఆడిటోరియంలో 700మంది విద్యార్థులతో జరుగుతున్న ఈ కార్యక్రమం 12,500 పాఠశాలల్లో ప్రత్యక్షప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమాన్ని కోటి 20 లక్షల మంది విద్యార్థులు వీక్షిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని ఇతర నగరాల పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో మోడీని ప్రశ్నలు అడిగేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధానికి పలు ప్రశ్నలు వేశారు. విద్యార్థుల ప్రశ్నలకు మోడీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.
1.విద్యార్థి) మీరు ప్రధాని ఎలా కాగలిగారు….?
ప్రధాని మోడీ)భారత దేశం ప్రజసామ్యదేశం …ఎవరైనా ప్రధాని అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీలో ఎవరైన ప్రధాని అయితే ప్రమాణస్వీకారానికి పిలవండి అని విద్యార్థులతో సంభాషించారు.
2.విద్యార్థి) నేను ప్రధాని కావడం ఎలా….?
మోడీ) వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని నవ్వుతూ బదులిచ్చారు మోడీ…
3)విద్యార్థి) మీరు చదువుకునే రోజుల్లో అల్లరి చేసేవారా….?
మోడీ) నేను చదువుకునే రోజుల్లో చాలా తుంటరి పనులు చేశారని అన్నారు.
4.విద్యార్థి) మీరు ప్రధాని కాగలనని ఎప్పుడైనా అనుకున్నారా….?
మోడీ) తానెప్పుడూ క్లాస్ లీడర్ గా కూడా పనిచేయలేదని ఇక ప్రధాని కాగలనని ఎలా కలగంటానని మోడీ ప్రశ్నించారు.
5. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చినందుకు మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు.
మోడీ….ఇల్లు, ఆఫీసు మధ్యే సమయం గడిపోతోందని,ఢిల్లీ చూడలేకపోతున్నానని ప్రధాని సమాధానమిచ్చారు.




