Tuesday, 3 November 2026

పోలీసుల అదుపులో విరసం నేత వరవరరావు

హైదరాబాద్‌: విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో విరసం నేతలు ఇవాళ సభ నిర్వహించాలనుకున్నారు. ఈ సదస్సుకు పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తుల్జాభవన్‌లో ఉన్న 50 మంది విరసం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరవరరావుతో పాటు పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మి, జార్ఖండ్‌ కళాకారుడు జీతన్‌ మరాండి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *