Tuesday, 3 November 2026

హిమాచల్ రిజర్వాయర్ లో మరో సంఘటన

బిలాస్  : హిమాచల్‌ ప్రదేశ్ లోని  బిలాస్  పూర్ సమీపంలో   ప్రమాదవశాత్తు  గోవింద్‌సాగర్ రిజర్వాయర్‌లో బస్సు అదుపుతప్పి పడిపోయింది . ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. 20మంది గాయపడ్డారు .పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు.బస్సులో ఎంతమంది  ప్రయాణిస్తున్నారో ఖచ్చితంగా తెలియదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.రుషికేష్ నుంచి బిలాస్పూర్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. బస్సులో ప్రయాణికులంతా స్థానికులేనని ఎస్పీ చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *