![]() |
ముంబై, ఆగస్టు 26 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం సాయంత్రం తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన తమ రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. గవర్నర్ ఈ రాజీనామాను తక్షణం ఆమోదించవచ్చునని తెలుస్తున్నది.
ఈ పర్యవసానంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి తమ పదవికి రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.





