హైదరాబాద్: పెట్టుబడి దారుల దృష్టంతా హైదరాబాద్‌పైనే ఉందని తెలంగాణ రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో పలు కంపెనీలు రానున్నాయని నాయిని తెలిపారు. బెంగళూరు అభివృద్ధి చెందిందని అక్కడివారంతా హైదరాబాద్ వచ్చేందుకు సుముకంగా ఉన్నారన్నారు. దీంతో యువతకు మంచి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. మెహదీపట్నంలోని పుల్లారెడ్డి పీజీ కళాశాలలో నాయిని జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్‌మేళాకు 500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.




