వరంగల్: ఆచార్య జయశంకర్ కలలుగన్న విధంగా తెలంగాణను పునర్నిర్మించడమే ఆయనకిచ్చే ఘన నివాళి అని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. హన్మకొండలోని కేయూ క్రాస్‌రోడ్డులో జయశంకర్ మెమోరియల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్ కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథౖలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ కాలజ్ఞాని అని కొనియాడారు. డిప్యూటి సీఎం రాజయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కీర్తించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణ వస్తుందో లేదో అన్న సందేహంలో ఉన్నప్పుడు తమను వెన్నంటి ప్రోత్సహించారని గుర్తు చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సేవా సమితిని మంత్రులు అభినందించారు. కేయూ ారస్తాను జయశంకర్ ారస్తాగా ప్రకటించారు. ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, జడ్పీ ా’య్రర్మన్ పద్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




