Monday, 2 November 2026

పొరుగు దేశాలతో సత్సంబంధాలు

03ప్రజాస్వామ్యం నా రక్తంలోనే ఉంది

న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగేందుకు భారత్‌ కృషిచేస్తుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రజాస్వామ్యం తన రక్తంలోనే ఉందని చెప్పారు. ఆయన సోమవారం న్యూయార్క్‌లోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారన్‌ రిలేషన్స్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌లో పరిపాలనను మెరుగుపర్చేందుకు ఈ-గవర్నెన్స్‌పై దృష్టిపెట్టామని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికాలోని 11 పెద్ద కంపెనీల సీఈఓలతో అల్పాహార విందులో పాల్గొన్నారు. గూగుల్‌ సీఈఓ ఎరిక్‌ ష్మిట్‌, పెప్సికో సీఈఓ ఇంద్రా నూయీ, సిటీ గ్రూప్‌ చీఫ్‌ మైకేల్‌ కోర్బాట్‌లతోపాటు పలు కంపెనీల సీఈఓలు సమావేశానికి హాజరయ్యారు. భారత్‌లో పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తదితర అంశాలకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడే అవకాశాలున్నాయి. కార్మిక చట్టాల్లో సంస్కరణలు చేపడతామని మోదీ తెలిపారు. ఆయన సోమవారం న్యూయార్క్‌లోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారన్‌ రిలేషన్స్‌లో ప్రసంగించారు. ఎఫ్‌డీఐలపై తొలి బడ్జెట్‌లోనే చొరవ తీసుకున్నామన్నారు. రైల్వేల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *