న్యూఢిల్లీ, అక్టోబర్ 10 (జనంసాక్షి) : రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కోసం నియమించిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ పంపకాలు పూర్తిచేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల మధ్య అధికారుల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఈ విభజన జరిగింది. కమిటీ సిఫార్సుల ప్రకారమే ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను కేటాయించారు. దీని ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌కు మొత్తం 211 మంది ఐఎఎస్‌లు, 144మంది ఐపిఎస్‌లు, 82మంది ఐఎఫ్‌ఎస్‌లను కేచాయించారు. ఇకపోతే తెలంగాణకు 163మంది ఐఎఎస్‌లు, 112 మంది ఐపిఎస్‌లు, 65మంది ఐఎఫ్‌ఎస్‌లను కేటాయించారు. ఈ విభజన నిజానికి నెల రోజుల క్రితమే పూర్తి అయ్యింది. అయితే కొంతమంది రకరకాల ఆక్షేపణలు వ్యక్తంచేయడంతో కొన్నాళ్లు ఈ నిర్ణయ ప్రకటన వాయిదా పడింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉండడంవల్ల కూడా ఈ నిర్ణయం ప్రకటనలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు పంపిణీ ప్రక్రియ పూర్తికావడంతో పెండింగ్‌లో ఉన్న ఆయా పనులకు మోక్షం కలుగునుంది. ఉద్యోగుల పంపిణీ విషయంలో జాప్యం జరుగుతోందని, త్వరగా పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తయిన ప్రత్యూష్‌సిన్హా పంపకం





