Monday, 2 November 2026

సీజేతో కేసీఆర్‌ భేటీ

6

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించాలనినే అంశంపై జస్టిస్‌ దత్తుతో జరిగిన సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం. రెండు రాష్ట్రాలకు ఒకే కోర్టు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని చాలా కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. తెలంగాణ న్యాయవాదుల నుంచి కూడా ప్రత్యేక కోర్టు ఏర్పాటు డిమాండ్‌ బలంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదులతో ఘర్షణ పడి వారితో కలిసి పనిచేయడం వారికి ఇబ్బందిగా మారింది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఇంకా చాలా మందిలో భేదభావాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు ఒకే కోర్టు ఉండడంతో తెలంగాణకు నష్టం జరుగుతోంది. చాలా కేసులకు సత్వర పరిష్కారం లభించడంలేదు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేసుల పెండింగ్‌ విషయాన్ని న్యాయవాదుల దృష్టికి తెచ్చారు. అదే సందర్భంలో తెలంగాణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు విషయంలోనూ న్యాయవాదులకు ఆయన హామీనిచ్చారు. ఆ హామీని అమలుచేయడంలో భాగంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని కోరినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *