Tuesday, 3 November 2026

కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌

5

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. దేశరాజధాని న్యూఢిల్లీ నుంచి ఆదివారం కేసీఆర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. మూడురోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఎన్టీపీసీ చైర్మన్‌తో రామగుండం థర్మల్‌ కేంద్రం స్థాపనపై చర్చలు జరిపిన విషయం కూడా తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీలతో వేరువేరుగా కలిశారు. ఉమ్మడి హైకోర్టును విభజించి రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. తెలంగాణకు ప్రత్యేక¬దా, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే విషయంపై శనివారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో చర్చించారు. రామగుండంలో 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర ఏర్పాటుపై ఎన్‌టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్‌చౌదరితో కేసీఆర్‌ మాట్లాడారు. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్‌ తిరిగి వెళ్లే వరకు తుగ్లక్‌రోడ్డులోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులతో కలిసి కెసిఆర్‌ విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 4గంటల సమయంలో హైదరాబాద్‌ బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపీలు వినోద్‌, బాల్క సుమన్‌ కోరారు. ముఖ్యమంత్రితోపాటు ఎంపీలు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని జైట్లీని కోరినట్లు వినోద్‌ విూడియాకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను జైట్లీ వద్ద కేసీఆర్‌ ప్రస్తావించారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరామని చెప్పారు. తెలంగాణలో 8 జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై జైట్లీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. హైదరాబాద్‌లో పన్నుల వసూళ్లపేరుతో అధికా ఆదాయం చూపుతున్నారని, కానీ ఇప్పుడు చాలా కంపెనీలు ఎపికి కడుతున్నాయని అన్నారు. ఎపి పేరుతో ఉండడంతో ఇది ఎపిఇ వెళుతోందని అందుకే దీనిని ఆర్థికమంత్రికి చూపామని అన్నారు. ఇక్కడి ఆయిల్‌ కంపెనీలతో పాటు అనేక కంపెఎనీలు టాక్స్‌ ఎపికి చెల్లిస్తున్నాయని చెప్పారు. ఇది తెలంగాణకురావాల్సి ఉందన్నారు. ఇక  పిడికెడు బొగ్గు దొరకని ఏపీలో విద్యుత్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బొగ్గు విరివిగా దొరికే తెలంగాణలో విద్యుత్‌ కొరత ఎందుకు ఉందన్నారు. పర్యటన సందర్భంగా వారు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *