రంగారెడ్డి, అక్టోబర్ 12 (జనంసాక్షి) : బోరుబావిలో చిక్కుకుని నాలుగేళ్ళ చిన్నారి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తోంది. చిన్నారి గిరిజ (4)ను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రం సమీపంలోని ఓ బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి పడిపోయింది. మంచాలకు చెందిన గిరిజ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. పోలీసులు, రెవిన్యూ అధికారులు చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పొక్లెయిన్‌తో సమాంతరంగా మరో గొయ్యి తవ్వి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడింది. గిరిజ అనే బాలిక ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి పడిపోయింది. బాలిక కుటుంబ సభ్యులతోపాటు రెవెన్యూ అధికారులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వితున్నారు. బాలికను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి





