
గోదావరిఖని కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్/గోదావరిఖని, అక్టోబర్ 17 (జనంసాక్షి) :
హత్యకేసులో ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష పడిం ది. ఈమేరకు గోదావరిఖని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురిని కిరాతకంగా హతమార్చిన ఇద్దరు హంతకులకు న్యాయస్థానం మరణ శాస నం చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రధమం గా గోదావరిఖనిలోని 6వ అదనపు జిల్లా న్యాయ మూర్తి జి.వెంకటక్రిష్ణయ్య శుక్రవారం సంచలన తీర్పును ఇచ్చారు. 30సంవత్సరాల తరువాత కరీంనగర్ జిల్లాలో కూడా చనిపోయేంత వరకు హంతకులను ఉరితీయాలన్నారు. ఈ మరణశాస నానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెంది న జునుగురి దేవేందర్(26)తో యైటింక్లయిన్ కాలనీలోని పోతన వీధికి చెందిన బోగిరి భాణ య్య(55), బోగిరి భాణమ్మల కూతురు అరుణ (25)తో వివాహం జరిగింది. ఐతే, అరుణకు దేవేందర్‌తో వివాహం జరగక ముందు గిరుగుల గంగులుతో వివాహం జరిగింది. గంగయ్యతో అరుణకు వైవాహిక విభేదాలు రావడంతో వీరి ద్దరు విడాకులు తీసుకోవడంతో అరుణను దేవేం దర్‌తో వివాహం జరిపించారు. కొంతకాలం వీరి ద్దరి వైవాహిక జీవనం సుఖంగా కొనసాగినప్పటికీ గంగులుతో అరుణ సత్సంబంధాలను కొన సాగిస్తూ తనను నిర్లక్ష్యంచేస్తుందని దేవేందర్‌లో అనుమానం మొలకెత్తింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అరుణ మొదటి భర్త గంగులుతో సంబంధాన్ని కొనసాగిస్తున్నదని దేవేందర్ అరుణ తల్లిదండ్రులు బాణయ్య, బాణమ్మలకు తెలపగా వారు సైతం అరుణ పక్షాన మాట్లాడారు. దీంతో బాణమ్మ, బాణయ్య, అరుణలపై దేవేందర్ కక్షను పెంచుకున్నాడు. ఈ ముగ్గురిని హతమార్చాలని… పథకం వేశాడు. ఇందుకు తన చిన్నాన్న కొడుకు జునుగురి నరేష్(24) సహాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో 2010 మార్చ్ 28న పోతనకాలనీలోని అరుణ ఇంటికి ఈ ఇద్దరొచ్చారు. బానయ్యకు మందు పార్టీ ఇచ్చారు. భోజనాలు చేసిన అనంతరం ఎక్కడి వారు అక్కడ నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో దేవేందర్, నరేష్‌లు భాణయ్యను చున్నీతో మెడకు ఉరివేసి, మెత్తతో ఊపిరిఆడకుండా చంపేశారు. మరో గదిలో నిద్రిస్తున్న అత్త భాణమ్మను నిద్రలేపి భాణయ్య ఎలాగో చేస్తున్నాడంటూ భాణయ్య మృతదేహం దగ్గరికి తీసుకొచ్చి ఆమెకు కూడా చున్నీతో ఉరివేసి చంపారు. భాణమ్మ కేకలు విన్న అరుణ సంఘటనా స్థలానికి రాగా ఆమెకు కూడా ఉరివేసి చంపేశారు. కాగా, ఈ ముగ్గురిని దేవేందర్, నరేష్‌లు హతమార్చడాన్ని అరుణ సోదరుడు రవి కూతురు బోగిరి దీప్తి(4) కన్నులార చూసింది. ఈ హంతకులు గమనించి దీప్తిని బాత్‌రూంలోకి తీసుకెళ్ళి కిరాతకంగా కాళ్ళతో తొక్కి చున్నీతో ఉరివేసి చంపారు. ఈ హత్యలు చేసిన దేవేందర్, నరేష్‌లు ఘటనా స్థలం నుంచి అదృశ్యమయ్యారు. చుట్టు ప్రక్కల వారు ఇచ్చిన సమాచారంతో ఈ హత్యోదంతాలపై కూపీలాగిన టూటౌన్ పోలీసులు హంతకులను చాకచక్యంగా పట్టుకున్నారు. దేవేందర్, నరేష్‌లపై మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన దీప్తి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని అప్పటి డిఎస్పీ హబీబ్ ఖాన్ నేతృత్వంలో టూటౌన్ అప్పటి సిఐ వెంకటరమణ 302, 498ఎ, 380, 34ఐపిసిల క్రింద కేసు నమోదుచేసుకొని నిందితులను కోర్టుకు హాజరుపరిచారు. ఈ హత్యోదంతంపై న్యాయస్థానం విచారణ జరపగా నిందితుల నేరాన్ని రుజువు చేసే సాక్షులను పిపి గిరిధర్‌రావు కోర్టుముందుంచారు. పూర్వ పరాలను పరిశీలించిన మీదట దేవేందర్, నరేష్‌లకు గోదావరిఖని 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.వెంకటక్రిష్ణయ్య మరణశిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారు. జిల్లా అదనపు న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు సంచలనం సృష్టించింది.




