Tuesday, 3 November 2026

జయకు బెయిలు

jaya

అక్రమాస్తుల కేసులో సుప్రీంలో ఊరట

శిక్షపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 (జనంసాక్షి) :

జయలలితకు శరతులతో కూడిన బెయిలు మంజూరైంది. అక్రమాస్తుల కేసులో శిక్షపడిన జయకు సుప్రీంకోర్టులో ఊర ట లభించింది. శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిం చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధిన ేత్రి జయలలితకు భారీ ఊరట లభించింది. ఆమెకు కింది కో ర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వంద కోట్ల జరిమా నాపై సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా స్టే విధించింది. జయతో పాటు ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి, శశికళ, సుధాకరన్‌లకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చే సింది.రూ.66.5కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయతో పాటు ముగ్గురికి గత నెల 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జ యకు జైలుతో పాటు రూ.100కోట్ల జరిమానా విధించిన కో ర్టు.. మిగిలిన ముగ్గురికి తలో రూ.10 కోట్ల చొప్పున జరిమా నా విధించింది. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అ గ్రహార జైలులోనే జయ ఉంటున్నారు. బెయిల్‌ ఇవ్వాలని వారు చేసుకున్న విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు తిరస్కరించిన సం గతి తెలిసిందే.జయ సహా ముగ్గురు నిందితులు దాఖలు చేస ిన బెయిల్‌ పిటిషన్‌, కింది కోర్టు విధించిన శిక్షపై స్టే కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హె చ్‌ఎల్‌ దత్తు, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ ఏకే సిక్రిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం వి చారించింది. జయ తరఫున సీనియర్‌ న్యాయవాదులు పాలీ నారిమన్‌, సుశీల్‌కుమార్‌, తులసి వాదనలు వినిపించారు. జయ అనారోగ్యంతో బాధ పడుతున్నారని, సీనియర్‌ సిటిజన్‌ అని నారిమన్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మానవతా దృక్పథంతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. జయ వాదనలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిందన్నారు. నలుగురు నిందితులు విచారణకు సహకరిస్తారని కోర్టుకు హావిూ ఇచ్చారు. హైకోర్టులో వాయిదాలు అడగరని జయ తరఫు న్యాయవాదులు తెలిపారు. అప్పీలుకు సంబంధించిన సమగ్ర నివేదికను రెండు నెలల్లోగా సమర్పిస్తామని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో వారి వాదనలు విన్న ధర్మాసనం జయతో పాటు మిగతా ముగ్గురికి కూడా షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. శాంతిభద్రతలకు భంగం కలిగించరాదని పార్టీ శ్రేణులకు సూచించాలని జయను ఆదేశించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతృప్తి చెందేలా ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. దిగువ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలన్న నిందితుల వాదనను ధర్మాసనం అంగీకరించింది. రెండు నెలల్లో కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకోవాలని, ఆలోపు సమగ్ర నివేదికను తయారు చేసుకోవాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్‌ 18కి వాయిదా వేసింది. అంతకు ముందు చీఫ్‌ జస్టిస్‌ దత్తు.. విచారణను ఆలస్యం చేయరాదని జయ తరఫు న్యాయవాదికి గట్టిగా సూచించారు. ఇప్పటికే 18 ఏళ్లు గడిచిందని గుర్తు చేసిన న్యాయమూర్తి.. అప్పీలు చేసుకొని మరో రెండు దశాబ్దాలు పొడిగించేందుకు యత్నించొద్దని తెలిపారు. దీనికి స్పందించిన నారీమన్‌.. రెండు నెలల్లో అప్పీలు పేపర్లు సిద్ధం చేసి కోర్టుకు సమర్పిస్తామన్నారు. మూడు నెలల్లో విచారణ ముగించాలని కర్ణాటక హైకోర్టును కోరతామని చెప్పారు. వాస్తవానికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయాల్సి ఉండిందని, జయ అనారోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకొంటే బాగుండేదన్నారు.

సంబరాల్లో అన్నాడీఎంకే శ్రేణులు..

జయకు బెయిల్‌ రావడంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. జయ నివాసం పోయేస్‌ గార్డెన్‌ వద్దకు పెద్ద సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. జయకు మద్దతుగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు అభిమానుల్లో ఒకింత ఉత్కంట నెలకొంది. అన్నాడీంఎకే 43వ వ్యవస్థాపక దినోత్సవమైన శుక్రవారం రోజైనా అమ్మ బయటకు వస్తుందా? లేదా? అన్న సందిగ్ధంలో మునిగిపోయారు. ఎట్టకేలకు మధ్యాహ్నం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

20 రోజులుగా జైల్లోనే

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ గత 20 రోజులుగా జైలులోనే ఉన్నారు. గత నెల 27న ఆమెతో పాటు మరో ముగ్గురికి బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు, రూ.100కోట్ల జరిమానా విధించింది. దీంతో అదే రోజున నిందితులను బెంగళూరు శివారల్లోని పరప్పన అగ్రహా జైలుకు తరలించారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై జయ హైకోర్టులో సవాలు చేశారు. కానీ, ఆమెకు అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెలవులు, విచారణల అనంతరం ఆమెకు 20 రోజలు తర్వాత బెయిల్‌ మంజూరైంది.

అభ్యంతరం తెలపని సుబ్రహ్మణ్య స్వామి

జయకు బెయిల్‌ ఇవ్వడంపై ప్రధాన పిటిషనర్‌ సుబ్రహ్మణ్య స్వామి అభ్యంతరం తెలపలేదు. జయ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ధర్మాసనం దృష్టికి పలు అంశాలు తీసుకువచ్చారు. జయ అరెస్టు తర్వాత అన్నాడీఎంకే కార్యకర్తలు రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని కార్టూన్ల ద్వారా అవమానించాని, తాను కూడా చెన్నై వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా జయలలిత తమ కార్యకర్తలకు పిలుపునివ్వాలని ఆదేశించాలని ఆయన కోర్టుకు సూచించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా చూడాలని జయ తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. ఆందోళనలు ఆపాలని జయలలిత కార్యకర్తలకు పిలుపునిస్తారని ఈ సందర్భంగా నారిమన్‌ కోర్టుకు హావిూ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *