జీఓ విడుదల
ఇక నుంచి వేర్వేరుగా ఇంటర్ పర్షీలు
హైదరాబాద్, అక్టోబర్ 20 (జనంసాక్షి) :
తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పా టు దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చే శారు. ఈమేరకు జీఓ నెం. 21ను విడుదల చేశారు. ఇక నుం చి వేర్వేరుగా ఇంటర్ పరీ క్షలు నిర్వహిం చనున్నారు. తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ పరిధిలోనే పరీక్షలు రాయ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇం టర్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం సోమ వారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంటర్ బోర్డును కూడా విభజిం చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ చ ట్టం-1971ని తెలంగాణ బోర్డుకు వర్తింప జేస్తూ ఉన్నత విద్యాశాఖ చట్ట ముసాయిదాను తయారుచేసింది. తెలం గాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు న్యాయ శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ముసాయిదా బిల్లుపై ముఖ్యమం త్రి కే.చంద్రశేఖరరావు శనివారం సంతకం చేశారు. దీంతో ఉన్నత విద్యా శాఖ సోమవారం జీ వో జారీచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి సంస్థల విభజన చురుగ్గా సాగుతోంది. విభ జన చట్టంలోని పదో షెడ్యూ లు లో ఉమ్మడి సం స్థలను పొందు పరి చారు. ఇందులో ఏపీ పీఎస్సీ, ఉన్నత విద్యా మండలి సహా ఇంటర్‌బోర్డు కూడా ఉన్నాయి. తెలం గాణకు ప్రత్యేక పబ్లిక్ కమిషన్‌తో పాటు ఉన్నత విద్యామండలిని ఏర్పాటుచేస్తూ ప్ర భుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. మ రోవైపు తాజాగా ఇంటర్‌బోర్డు విభజనపైనా దృష్టి సారించింది. ఇంటర్‌బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది ఏ రాష్ట్ర విద్యార్థులు ఆ రాష్ట్ర పరిధిలోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. దీంతో ఉన్నత విద్యాశాఖ ముసాయిదా బిల్లును రూపొం దిం చింది. ఈ ముసాయిదాను
పరిశీలించిన న్యాయశాఖ అభ్యంతరాలు తెలపకపోవడంతో దస్త్రం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. దీనికి కేసీఆర్ ఆమోదముద్ర లభించడంతో ఇంటర్‌బోర్డు ఏర్పాటుచేస్తూ సోమవారం జీవో నెం.21 వెలువడింది. విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజ్‌కు బోర్డు కార్యదర్శి బాధ్యతల్ని అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా జీవో జారీతో వచ్చే ఏడాది మార్చిలో ప్రారం భం కానున్న ఇంటర్ వార్షి పరీక్షలను విద్యా ర్థులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే రాయ నున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలని ఆంద్ర óప్రదేశ్ సర్కారు యోచించింది. కానీ ఇంటర్ బోర్డు విభజనకే మొగ్గుచూపిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.





