హైదరాబాద్, అక్టోబర్ 20 (జనంసాక్షి) : పోలీసు అమరవీరు లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళ్ళర్పించారు. విధి నిర్వ హణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరుల త్యాగానికి సార్థకత చేకూరాలని ఆయన అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలో పోలీసులదే ముఖ్యపాత్ర అని ఆయన చెప్పారు. వారు శాంతిభద్రతలను కాపాడడంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని అన్నారు. మంగళవారం నాడు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసులు ఆయుధాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 653 మంది పోలీసులు చనిపోయారు. పోలీసుల కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఫోన్‌చేసిన 10 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకునే వ్యవస్థను ప్రస్తుతం ఏర్పాటుచేశామని ఆయన పేర్కొన్నారు. పోలీసుల కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అమర పోలీసులకు సీఎం నివాళి





