ఒడిషాలో రాహుల్ పర్యటన
భువనేశ్వర్, అక్టోబర్ 20 (జనంసాక్షి) :
తుపాను బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. సోమవారం ఒడిశా లో ఆయన పర్యటించారు. హుదూద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితు లను పరామర్శిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని,
సాధారణ జనజీవనం ఏర్పడే వరకు పార్టీ తరపున సాయం చేస్తామని రాహుల్ చెప్పారు. కొరాపుట్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాన్ తీవ్రత, సహాయక చర్యల గురించి పార్లమెంట్‌లో
ప్రస్తావిస్తానని రాహుల్ చెప్పారు. ఆదివారం రాహుల్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. విశాఖ,
విజయనగరం జిల్లాల్లో పర్యటించి తుపాన్ బాధితులను పరామర్శించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తుపాను బీభత్సం అంశాన్ని లేవనెత్తి బాధితులకు తగిన సహాయం అందేలా కృషిచేస్తానని ఆయన హామీనిచ్చారు. పలుచోట్ల ఆయన ప్రజలను పలుకరిస్తూ నష్టం వివరాలు, వారి బాధలు తెలుసుకున్నారు.





