
ముంబయి: అమరావతి- ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు రెండు బుధవారం ఉదయం ముంబయిలోని కల్యాణ్ ప్రాంతంలో పట్టాలు తప్పాయి. దీంతో నాసిక్-ఇగత్‌పురి మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. రైలు కల్యాణ్ స్టేషన్‌కు చేరుకునే సమయంలో ఇంజిన్‌తో పాటు మరో బోగీ పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో రైలు 15 కి.మీ వేగంతో వస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వేబోర్డు ా’య్రర్మన్ అరుణేంద్రకుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనలో ఎవరికీ ప్రాణహాని, గాయాలు కాలేదని అరుణేంద్రకుమార్ తెలిపారు. విడిపోయిన బోగీని ఇప్పటికే అమర్చామని, మరో బోగినీ కూడా అమర్చుతామని తెలిపారు.
పట్టాలు తప్పిన అమరావతి-ముంబయి ఎక్స్‌ప్రెస్




