Monday, 2 November 2026

జూడాల సమ్మెపై హైకోర్టులో వాదనలు పూర్తి

high-court
తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 : తెలంగాణలో జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూడాలపై చర్యలు తీసుకోవడం క్షణం పట్టదు… కానీ మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వెనకడుగు వేస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది.
జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. గ్రామీణ సేవలు మినహా మిగిలిన డిమాండ్లు నెరవేర్చామని, గౌరవ వేతనం కోసం రూ. 3 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో హైకోర్టు జూడాలను సూటిగా పలు ప్రశ్నలను సంధించింది. సమ్మె కారణంగా రోగులు చనిపోతే బాధ్యులెవరని జూడాలకు ప్రశ్నించింది. డిమాండ్ల సాధన కోసం సమ్మె కంటే ముందు కోర్టుకు ఎందుకు రాలేదని నిలదీసింది. సమ్మె వెనక రాజకీయ ఉద్దేశం ఉందా అని ప్రశ్నించింది. సమ్మెకు పౌర సమాజం నుంచి మద్దతు లేదని హైకోర్టు పేర్కొంది. ప్రజల కోసమే సమ్మె చేస్తున్నామని, స్వప్రయోజనాల కోసం కాదని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *