ముంబై: మహారాష్ట్రలో కొత్తగా బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. ఇవాళ ఇక్కడి వాంఖడే స్టేడియంలో ఆపార్టీ సభ్యుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఏక్‌నాథ్ ఖడ్సే, సుధీర్ ముంగంటివార్, వినోద్ తవడే, పంకజ్ ముండే, ప్రకాశ్ మెహతా, విష్ణుసవ్ర, చంద్రకాంత్ పాటిల్ కేబినెట్ మంత్రులుగా, దిలిప్ కాంబ్లే మరియు విద్యా ఠాకూర్ సహాయ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.




