ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. మహారాష్ట్రకు ఫడణవీస్ భాజపా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు తదితర కేంద్రమంత్రులు, అమిత్‌షా, అద్వానీ తదితర పార్టీ అగ్రనేతలు, భాజపా ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, రతన్ టాటా, ముఖేశ్ అంబానీ తదితర పారిశ్రామికవేత్తలు, లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.
మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఫడణవీస్





