Tuesday, 3 November 2026

కంటోన్మెంట్‌లో టీడీపీ, బీజేపీ కూటమి డకౌట్

హైదరాబాద్  జనం సాక్షి: కంటోన్మెంట్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి చుక్కెదురైంది. మొత్తం 8 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి బలపర్చిన అభ్యర్థులు ఒక్క చోట కూడా ఖాతా తెరవలేదు. హైదరాబాద్‌లో తమకు ఎదురులేదనుకున్న టీడీపీ బీజేపీకి కంటోన్మెంట్ ప్రజలు షాక్ ఇచ్చారు. టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిని(4వార్డు) సైతం ఘోర పరాజయం పాలైంది. మొత్తం 8 స్థానాలకు గాను టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు 6 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ గ్రేటర్‌లో సత్తా ఎంటో నిరూపించుకుంది. రెబెల్స్‌గా పోటీ చేసి గెలిచిన మరో ఇద్దరు కూడా తాము టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 114 మంది పోటీ పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *