జమ్ము:
జమ్ము కశ్మీర్లో ఆర్మీ హెలికాప్టర్ ధ్రువ్ కూలిన ఘటనలో హైదరాబాద్కు చెందిన మేజర్ తాహెర్ దుర్మరణం పాలయ్యాడు.. ప్రమాదవార్తతో కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం విశ్వకర్మకాలనీలోని తాహెర్ హుస్సేన్ఖాన్ ఇంటివద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఊహించని వార్తతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణవార్త తెలుసుకున్న సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ అధికారులు తాహెర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తాహెర్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి తీసుకువస్తారని, నేడు అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. తాహేర్ హుస్సేన్ కు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది




