ముంబయి: దేశంలోని పెద్ద సాఫ్ట్వేర్ సంస్థల్లో మూడోదైన విప్రో షేర్ల ధరలు సోమవారం 9 శాతం పెరుగుదల నమోదు చేశాయి. ఈ సంస్థ తొలి త్రైమాసిక ఫలితాల్లో లాభాల్లో 11 శాతం వృద్ధి నమోదు చేయడమే అందుకు కారణం. శుక్రవారం సాయంత్రం విప్రో ఫలితాలను ప్రకటించగా సోమవారం మార్కెట్ ప్రారంభమవుతూనే ఈ సంస్థ షేర్లు సానుకూలంగా అరంభమై కొద్ది సేపట్లోనే 9 శాతం వృద్ధి సాధించాయి. దాంతో విప్రో బీఎస్ఈలో టాప్ గెయినర్‌గా నిలిచింది.




