Tuesday, 3 November 2026

9,10 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్ : కేరళ తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 9న ఉత్తర దిశగా ప్రయాణించి గోవా వద్ద వాయుగుండం తీరం దాటనుంది. ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి హైదరాబాద్ పరిసరాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రోజుల్లో రాయలసీమలో, 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *