విధులు బహిష్కరించిన న్యాయవాదులు
మెట్పల్లి: తెలంగాణకోసం ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్‌కి చెందిన సుమన్‌కు సంతాపంగా మెట్పల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
మెట్పల్లి: తెలంగాణకోసం ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్‌కి చెందిన సుమన్‌కు సంతాపంగా మెట్పల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
మెట్పల్లి: ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రధాని నివాస ముట్టడిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మెట్పల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
మెట్పల్లి: మండలంలోని ఆరిపేట గ్రామంలో బాలింతలకు, గర్భిణులకు పోషకాహరంపై అవగాహన కల్పించారు. పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుందని నిర్వహకులన్నారు.
గోదావరిఖని: ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా గోదావరిఖనిలో బీజేపీ నాయకులు పట్టణంలోని రాజీవ్‌రహదారిపై రాస్తా రోకో చేశారు
కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన మమత(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మమత జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది.
కమలాపూర్: మండలంలో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కరీంనగర్: కొహెడ మండలంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఎల్ఐసీ జీవిత బీమా సంస్థ బీమా వారోత్సవాల సంధర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పాలసీదారుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
కరీంనగర్: ధర్మారం మండలంలోని రచ్చపల్లి శివారులో ఉన్న బుగ్గమాటుకు వరదతాకిడితోగండిపడింది. 2రోజులుగా ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో వాగులో వరద పోటేత్తింది. వరద ఉదృతికి గండిపడటంతో నీరంతా కిందకు వెళ్లిపోతుంది.
కరీంనగర్: ధర్మారం మండలంలోని మేడారం గ్రామాస్థులు విద్యుత్ తీగలు పదేపదే తెగిపడుతుండటంతో భయంభయంగా ఉంటున్నామని ఇళ్లపైనుంచి హైటెన్షన్ వైర్లను తొలగించాని డిమాండ్ చేస్తూ ధరన్మారం-పెద్దపల్లి రహదారిపై ధర్నా చేశారు. ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలగిస్తామని విద్యుత్ ఏడిఈ శ్రీనివాస్…
కరీంనగర్: గంగాధరలో దోడ్ల పరశురాముడు అనే రైతుకు చెందిన వ్యవసాయ బవిలో కొండచిలువ పడింది. బావిలో విద్యుత్ మోటరు తీయడానికి ప్రయత్నించగా కొండచిలువపడింది. దీన్ని వలలతో పైకి తీసి చంపివేశారు. ఆరడుగుల పోడవుంది.