Sunday, 22 November 2026

హైదరాబాద్

విద్యార్థులను ఆందోళకు గురిచేసిన ఇన్విజిలేటర్లు

తిరుపతి : జేఈఈ పరీక్ష ప్రారంభించే చివరిక్షణంలో పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్లు విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. హాల్‌ టిక్కెట్స్‌ జిరాక్స్‌ కాపీ కావాలన్నారు. జిరాక్స్‌ కాపీ కోసం విద్యార్థులు పరుగులు తీశారు. ఇన్విజిలేటర్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.

ముగిసిన టెన్త్‌ ప్రధాన పరిక్షలు

జనంసాక్షి, హైదరాబాద్‌ : పదో తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. మరో రెండు పరీక్షలను ఈ నె 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. 8న ఒ.ఎస్‌.ఎస్‌.సి. మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌), 9న ఎస్‌.ఎస్‌.సి. వొకేషనల్‌…

ఐదు ఇసుక లారీల పట్టివేత

మైదుకూరు(కడప) : కాజీపేట, కమలాపురం ప్రాంతాల్లోని పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తరిలిస్తున్న ఐదు లారీలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. జేసీబీ తోపాటు నాలుగు ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న వాహనాలను కమలాపురం పోలాసులకు అప్పగించారు.

జేఈఈ పరిక్ష ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. వరంగల్‌, తిరుపతి, గుంటూరు, ఖమ్మం నగరాల్లో మొత్తం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట జరిగే బీఆర్క్‌ పరీక్ష…

శ్రీలంకలో 56 మంది తమిళ జాలర్ల అరెస్టు

కొలబో/ రామేశ్వరం : అంతర్జాతీయ తీర జలాల్లోకి చొరబడ్డారంటూ శుక్ర, శనివారాల్లో మొత్తం 56 మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని అధికారులు వెల్లడించారు. రామేశ్వరానికి చెందిన 30 మంది జాలర్లను అరెస్టు చేయడంతోపాటు వారి…

దుండగుల దాడిలో 11 మంది మృతి

నైజీరియా : తూర్పు నైజీరియాలోని అడమవా రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. తుపాకులు, కత్తులతో దుండగులు గవర్నర్‌ ఉంటున్న మిల్దు గ్రామంలో దాడులకు దిగారు. అయితే…

నిమ్స్‌లో దీక్ష విరమించిన విజయమ్మ

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిమ్స్‌ ఆస్పత్రిలో ఈ ఉదయం దీక్ష విరమించారు. సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, రైల్వే కోడూరుకు చెందిన రైతు వెంకటయ్యలు వైఎస్‌ఆర్‌ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్ష వారమింపజేశారు.…

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

పాకాల :చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం గుంటగాదంకి వద్ద క్వాలిన్‌ వాహనం, కోళ్ల వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి పరిస్థి విషయంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.…

రాజగోపాల్‌ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనను సీబీఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారమందింది.

విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమ ఆందోళనకు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమలు ఆందోళన బాట పట్టనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న అదనపు ఛార్జీలకు తోడు కరెంటు కోతలు విధిస్తుండటంతో పరిశ్రమలు నడపలేని స్థితికి చేరుతున్నయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం…