Saturday, 21 November 2026

హైదరాబాద్

సీఎం సభావేదిక వద్ద అనుమానితుడు

విశాఖ : జేకే వీధిలో ఏర్పాటు చేసిన సీఎం సభావేదిక వద్ద అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభాస్థలి వద్ద పోలీసు భద్రతను పెంచారు.

సెల్లార్‌ కూలి ఆరుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ : నగరంలోని మన్యూరాబాద్‌లో సెల్లార్‌ కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వాపాడేందుకు స్థానికులు యత్నిస్తున్నారు.

విపత్తుల నిర్వహణ కింద రాష్ట్రానికి రూ. 740 కోట్లు : షిండే

ఏలూరు : జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంక్‌ సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. మొదటి…

ప్రధాని మన్మోహన్‌, సోనియాకు కరుణానిధి లేఖ

చెన్నై : శ్రీలంకకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానాన్ని భారత్‌ సమర్థించకపోతే యూపీఏలో కొనసాగే ప్రసక్తిలేదని డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. అమెరికా తీర్మానంలో జాతి నిర్మూలనకు…

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : మొహాలీ టెస్ట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 431 పరుగుల వద్ద అశ్విన్‌ (4) అవుటయ్యాడు.

విశాఖ చేరుకున్న సీఎం

విశాఖపట్నం : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నం జిల్లాలో పటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. జడేజా(8) సిడిల్‌ బౌలింగ్‌లో హడ్డిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్లేమీ కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను…

గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి

ఇచ్చోడ : ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలోని సుభాష్‌నగర్‌లో ప్రహరీగోడ కూలి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పురాతన గోడ వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 416 పరుగుల వద్ద ధోరీ (4) స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. స్టార్క్‌ బౌలింగ్‌లోనే అంతకుముందు సెంచరీ వీరుడు మురళీ…

మురళీ విజయ్‌(153) ఔట్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ వీరుడు మురళీ విజయ్‌(153) స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. వికెట్లేమీ కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు…