Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఉప్పల్‌లోని రసాయనసంస్థలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఐడీఏ ఉప్పల్‌లో ఉన్న జీవీకే బయోసైన్స్‌ రసాయన సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సంస్థపక్కనే గ్యాస్‌ సిలిండర్ల గోదాం ఉండడంతో స్థానికులు భయాందోళనలకు…

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు : బలరాం నాయక్‌

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్‌లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కేంద్రమంత్రి బలరాం నాయక్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులధ్రువీకరణ పత్రాల కేసులను పదోపతరగతి లోపే పరిష్కరించాలని ఆయన సూచించారు.

పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

ఆదిలాబాద్‌: పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్‌ జిల్లా వాంఖిడి సీఐ లచ్ఛన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు, సోనాపూర్‌కు చెందిన ఒక మహిళ వద్ద ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నవోదయ సిబ్బంది సమ్మె : తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రీజియన్లో జవహర్‌ నవోదయ విద్యాలయ ఉపాధ్యాయులు, సిబ్బంది చేపట్టిన సమ్మె ఆరోజూ కొనసాగుతొంది. దాంతో సీబీఎస్‌ఈ 10,12 తరగతుల పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతున్నారు.

తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ అజంఖాన్‌ రాజీనామా

ఉత్తరప్రదేశ్‌ : అలహాబాద్‌లో మహాకుంభమేళా సందర్భంగా నిన్న రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కుంభమేళా ఇన్‌ఛార్జి పదవికి సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌ రాజీనామా చేశారు.  ఈతొక్కిసలాటలో మృతుల సంఖ్య 37కు చేరింది.

ఆదిలాబాద్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం వాంఖిడి వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పింది. డ్రైవరు బస్సును అదుపు చేసే ప్రయత్నంలో ఉండగానే ఇద్దరు వ్యక్తులు బస్సులో నుంచి బయటకు దూకారు. వారిలో ఒకరు…

బండ్ల గణేశ్‌ ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

రుణమాఫీపై కేంద్రమంత్రి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం : సోమిరెడ్డి

హైదరాబాద్‌: రైతుల రుణమాఫీపై కేంద్రమంత్రి సచిన్‌ పైలట్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీ సాధ్యం కాదని సీఎం ఎలా చెప్పగలిగారో సమాధానం చెప్పాలని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కిరణ్‌కుమార్‌రెడ్డి…

అఫ్జల్‌ గురు కుటుంబానికి మూడు రోజుల తర్వాత అందిన లేఖ

శ్రీనగర్‌ : అఫ్జల్‌గురు ఉరి శిక్ష అమలుపై అతని కుటుంబానికి సమాచారమిస్తూ ప్రభుత్వం పంపిన లేఖ అతని కుటుంబానికి సోమవారం అందింది. అఫ్జల్‌గురును శనివారం ఉదయమే తీహర్‌ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అతని…

ఈ నెల 12 నుంచి 15 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ నెల 12 నుంచి 15 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ తెలియజేశారు. హైదరాబాద్‌నుంచి ఇతర ప్రాంతాలకు 1200 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన తెలియజేశారు.