Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఎన్జీరంగా వీసీ నియామకంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకంపై ప్రభుత్వ చర్యలను రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. ఉపకులపతి నియామకం నిబంధనలకు విరుద్ధమని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు నేడు కోట్టివేసింది. యాజీసీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉపకులపతి నియామకం జరిగిందని హైకోర్టు…

సమాచార హక్కు నియామకం : పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో…

చిత్రావతి నదిపై అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంలో నిజదావా

న్యూఢిల్లీ : చిత్రావతి నదిపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ నిజదావా దాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పరగోడు రిజర్వాయర్‌కు నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని ఆందులో పేర్కొంది. అక్రమ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని…

ఏపీపీఎస్సీ ముందు అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: గ్రూప్‌-2 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు. 2011లో ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికే ఇంత వరకూ ఫలితాలు వెల్లడిచేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతోపాటు పరీక్షలు రాసిన ఎగ్జిక్యూటివ్‌…

తొక్కిసలాట మృతుల బంధువుల ఆందోళన

అలహాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన బాధితులు ఆందోళనకు దిగారు. అధికారుల నుంఇ సరైన స్పందన లేదుంటూ మృతుల బంధువులు నిరసన చేపట్టారు. మృతదేహాలపై కప్పె గుడ్డ కోసం కూడా తమను ఆసుపత్రి సిబ్బంది డబ్బులు అడిగారని…

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ :పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

చమురు సంస్థలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: వంటగ్యాస్‌కు ఆధార్‌ కార్డుల అనుసంధానంపై హైకోర్టు చమురు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, చమురు సంస్థలను కోర్టు ఆదేశించింది.

కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ వాయిదా

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన ఘటనలో ఒవైసీ సొదరుల విచారణ కేసును సంగారెడ్డి కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రికార్డులు సరిగా లేనందున కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

ఢిల్లీ అత్యాచారం ఘటనలో నేడు కొనసాగనున్న విచారణ

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది.ఈ కేసులో అభియోగాలు నమోదైన ఐదుగురి నిందితులపై కోర్టు విచారణ చేపట్టనుంది. గత వారం బాధితురాలి స్నేహితుడుతో పాటు పలువురి సాక్ష్యాలను…