Tuesday, 17 November 2026

హైదరాబాద్

ఉపసభాపతి ఆధ్వర్యంలో ఆర్జీల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్జీల కమిటీ నేడు సమావేశమైంది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేసిన ఆర్జీపై సమావేశంలో చర్చ జరిగింది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని కమిటీ సభ్యులు…

నత్తెనపల్లిలో రైతుల ఆందోళన

గుంటూరు : సాగునీటిని విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో సత్తెనపల్లి- గుంటూరు రహదారిపై 4 గంటలుగా వాహనాల రాకపోకాలు స్తంభించాయి.

స్త్రీల గ్రహస్థితి బాగోలేదట! ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి ఉవాచ

రాయ్‌పూర్‌ : ఢిల్లీ ఘటన నేపథ్యంలో మనదేశంలో నేతల మనసులో మాటలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి  నోరు విప్పారు. ఓపక్క కంకర్‌ జిల్లా గిరిజన బాలికల వసతి గృహంలో మైనర్‌ బాలికలపై అత్యాచారం కేసు…

రామచంద్రయ్య తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారు : మంత్రి కొండ్రు మురళి

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల విషయంలో విపక్షాలు ప్రజలను గందరగోళపరుస్తున్నాయని మంత్రి కొండ్రు మురళి విమర్శించారు. మంత్రి రామచంద్రయ్య తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిపై తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న  అవినీతి ఆరోపణలపై మండిపడ్డారు.

జగన్‌ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలి: నేత నరేందర్‌రెడ్డి

వరంగల్‌ : జగన్‌ అక్రమాస్తులను పూర్తిగా జప్తు చేయాలని తెదేపా అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అక్రమాస్తులను దర్యాప్తు సంస్థలు ఓవైపు జప్తు చేస్తుంటే.. జగన్‌ విడుదల కోసం వైకాపా నేతలు కోటి సంతకాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని…

ముఖ్యమంత్రితో డీజీపీ సమావేశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డీజీపీ దినేశ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు సీఎం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి అక్బరుద్దీన్‌ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు…

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి మాణిక్యప్రసాద్‌  తెలిపారు. పెంపు ప్రతిపాదన ఇంకా ఈఆర్‌సీ దశలోనే ఉందని చెప్పారు. అందరీ అభిప్రాయాలు విన్నాక మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సామాన్యులపై భారం…

జార్ఖండ్‌లో కొత్త సర్కార్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం : శిబూసోరెస్‌

రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ముండా రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు జేఎంఎం అధినేత శిబూసోరెన్‌ ప్రకటించారు. 81 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో భాజపా, జేఎంఎంలకు చెరో 18 మంది ఎమ్మెల్యేలు…

గాంధీ ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు

హైదరాబాద్‌: ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ ఉదయం వైద్య  పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన అక్బరుద్దీన్‌కు అత్యవసర విభాగంలో ఐదుగురు వైద్యుల ప్రత్యేక…

ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్ర

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర నేడు వరంగల్‌ జిల్లాలో ముగిసి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనుంది. వరంగల్‌ జిల్లాలో నేడు పదకొండ రోజు యాత్రను చంద్రబాబు నర్సింహిలపేట నుంచి ప్రారంభించనున్నారు. బకరూపులతండా,…